Sarkar Live

Superstar Rajinikanth జైలర్ -2లో బాలయ్య..?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth )హీరోగా తెరకెక్కుతున్న మూవీ జైలర్-2 (Jailar-2). నెల్సన్ దిలీప్ (Nelson Dileep kumar) కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్లో

Superstar Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth )హీరోగా తెరకెక్కుతున్న మూవీ జైలర్-2 (Jailar-2). నెల్సన్ దిలీప్ (Nelson Dileep kumar) కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్లో వరుస ప్లాఫ్ లు ఎదుర్కొంటున్న దశలో జైలర్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ సూపర్ స్టార్ బాక్సాఫీస్ కి తన స్టామినా రుచి చూపించాడు.

అంతకుముందు తీసిన కొన్ని సినిమాలు ఒక రేంజ్ లోనే ఉన్నా కూడా సూపర్ స్టార్ రేంజ్ లో ఉండట్లేదనే నిరాశ ఫ్యాన్స్ లో ఉండేది. కానీ ఈ మూవీ అన్ని విమర్శలను తిప్పికొట్టింది. దిలీప్ నెల్సన్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా కూడా ఇది నిలిచిపోయింది.

ఇక తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తీసిన ఒక మూవీ డిజాస్టర్ లిస్టులో చేరిపోగా దిలీప్ నెల్సన్ జైలర్-2 స్క్రిప్ట్ పనులు ప్రారంభించాడు. సూపర్ స్టార్ ను కలిసిన సీక్వెల్ కి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. అంతకుముందే లోకేష్ కనగరాజు(Lokesh kanagaraj) డైరెక్షన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలతో కూలి సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ కావొచ్చింది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కూడా మెరువబోతున్నారు.

శరవేగంగా Superstar Rajinikanth జైలర్ -2 షూటింగ్..

ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే జైలర్ -2 కూడా మొదలెట్టారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. జైలర్ మూవీలో మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ మెరిసి మూవీ హిట్టులో భాగమయ్యారు. వారి పాత్రలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఇక ఇప్పుడు వస్తున్న జైలర్ -2 కూడా మరో స్టార్ మెరువబోతున్నట్లు తెలుస్తోంది.

పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య..?

నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri natasimham balakrishna) జైలర్-2 లో నటించబోతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది. బాలకృష్ణ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా యాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో రౌడీ ఇన్స్పెక్టర్ ,లక్ష్మీనరసింహ చెన్నకేశవరెడ్డి లాంటి చాలా సినిమాల్లో పోలీస్ గెటప్ లో కనిపించి తన పవర్ ని చూపించాడు. ఈ మూవీలో కూడా మరొకసారి పోలీస్ గెటప్ లో సింహం గర్జించబోతున్నట్లు టాక్ వినబడుతుంది. ఈ రూమర్స్ పై మూవీ టీమ్ మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ టీం స్పందించాల్సి ఉంది.ఏదేమైనా బాలకృష్ణ నటించబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!