ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation
హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న గందరగోళం
Indigo Flight Cancellation | న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కార్యకలాపాలు వరుసగా రెండో రోజు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్కసారిగా తలెత్తిన ఈ అంతరాయం కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రధాన విమానాశ్రయాలలో రద్దుల సంఖ్య:
ఢిల్లీ విమానాశ్రయం: 220కు పైగా విమానాలు రద్దు.
బెంగళూరు విమానాశ్రయం: 100కు పైగా విమానాలు రద్దు.
హైదరాబాద్ (RGIA): మొత్తం మీద 90కి పైగా విమానాలు
హైదరాబాద్‌లో గందరగోళం
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురు, శుక్రవారాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయ అధిక...
