WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌరసేవలు
WhatsApp governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం అనేక వినూత్న విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) అనే కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరసేవలను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (AP govt) ముఖ్యోద్దేశం.
WhatsApp governance లో ఎన్ని సేవలు?
WhatsApp governance in AP : వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలు 161 రకాల సేవలను పొందొచ్చు. దేవదాయ(Endowment Deportment), ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC), రెవెన్యూ, మునిసిపాలిటీ తదితర విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. పౌరులు తమ మొబైల్ ఫోన్ నుంచే తేలికగా సేవలను పొందేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ప్రభుత్వానికి నేరుగా సమస్యలను దరఖాస్తులు, విజ్ఞాపణల ద్వారా తెలియజేసే వీలుంటుంది. వాటిని అధికారులు...
