Anganwadi posts : తెలంగాణలో అంగన్వాడీల భారీ నియామకాలకు ప్రభుత్వం (Telangana government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతినిచ్చింది. వీటిలో 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భారీ సంఖ్యలో అంగన్వాడీల (Anganwadi) నియామకాలు చేపట్టడం ఇదే ప్రథమం.
ఫైల్‌పై సంతకం చేసిన మంత్రి సీతక్క
అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధిత ఫైల్‌పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క (Women and child welfare minister Danasari Seethakka) సంతకం చేశారు. త్వరలోనే దీని నోటిఫికేషన్ వెలువడనుంది. 65 సంవత్సరాలు పూర్తయిన 3,914 మంది అంగన్వాడీలు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వారి స్థానంలో కొత్తవారిని నియమించడంతో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు.
Anganwadi posts : విదార్హత,, వయో పరిమితి
అంగన్వాడీ పోస్టులకు గతంలో కనీస విద్యార్హత పదో తరగతి ఉండేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల అనుసారం కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ (12వ తరగతి)గా నిర్ధారించారు. అభ్యర్థులు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. ఇదెంత ఉంటుందో ఇంకా స్పష్టత రాలేదు. నోటిఫికేషన్ ద్వారానే తెలుస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..