ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు
Tiger Trapped in Adilabad | రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు పులిసంచారంతో 2 నెలలుగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటిక్రితమే ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకున్నట్లు తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. హమ్మయ్య పులిని బంధించారంట మనకేం భయం అక్కర్లేదని ప్రజలు ఖుషీగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్ సరిహద్దులో పులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు ఆ పులిన మగ పులిగా నిర్ధారించినట్లు సమాచారం.
వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన..
కాగా , ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad District )జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌లో నవంబర్ 29న పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మి(22)పై దాడి చేసి చంపేసిన సంఘటన నుంచి తేరుకోక ముందే నజ్రూల్‌నగర్ క్యాంపులో మళ్లీ ఆవుపై దాడి చేసిన విషయం తెలిసిందే.. మరోసారి ఘటనలో పత్తి ఏరుతున్న రౌతుపై దాడి చేసింది. మూడు రోజుల క్రితం కూడా సిర్పూరు(టి) చీలపెల్లిలో అటవీప్రాంతంలో ఎద్దుపై పులి దాడి చేసింది. అయితే పులులు ఎన్ని తిరుగుతున్నాయనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఇవి మహారాష్ట్ర అడవుల నుంచి వొస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇది పులుల సంతానోత్పత్తికి అనువైన సమయం అని అంటున్నారు. అయితే ఎట్టకేలకు ఒక పులిని అటవీశాఖ అధికారులు బంధించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..