Tollywood News : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Tollywood king Nagarjuna) సోలో హీరోగా మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. నా సామిరంగా మూవీ తర్వాత ఏ సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. రకరకాల కొత్త డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్న కూడా అవి రూమర్ గానే మిగిలాయి. నాగ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న ప్రశ్న చాలా రోజులుగా వినపడుతూనే ఉంది. దీనికి కారణం నాగ్ కెరీర్ లో ఇది 100 వ సినిమా కావడమే. అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలబడిపోయే మూవీ కావడంతో అది ఎవరి చేతుల్లో పెడదాం అన్న చర్చ జరుగుతూనే ఉంది.
Nagarjuna కొత్త సినిమా
ఆ మధ్య ఇద్దరు తెలుగు డైరెక్టర్లు, తర్వాత తమిళ్ డైరెక్టర్ ల పేర్లు వినిపించిన కూడా అవి చర్చల దశలోనే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల(Shekar kammula)డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర (Dhanush kubera),అలాగే లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (super star Rajnikanth)తో కూలీ (kooli) మూవీలో చేశాడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. తన సోలో మూవీకి చాలా కథలు విన్న నాగ్ లేటెస్ట్ గా క్రైమ్ మూవీస్ తో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను డైరెక్షన్లో మూవీ ఓకే అయినట్టు తెలుస్తోంది.
హిట్ 3 రిలీజ్ తర్వాత సెట్స్ పైకి..?
నాని(Nani )ప్రొడ్యూస్ చేసిన హిట్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన శైలేశ్ కొలను(Shailesh kolanu)ఆ తర్వాత కూడా హిట్ 2 తీసి ఆ జానర్ లోనే విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ ఇంత బాగా ఆడటంతో విక్టరీ వెంకటేష్ ప్రతిష్టాత్మకమైన 75వ సినిమాను తన చేతిలో పెట్టారు. కానీ భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ప్రజెంట్ శైలేష్ కొలను నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 మూవీ కంప్లీట్ చేశాడు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే నాగ్ తో మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లి ఆలోచనలోనే ఉన్నాడట.
క్రైమ్ నేపథ్యంలోనే మూవీ..?
ఆల్రెడీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి వెయిట్ చేస్తున్నాడట. బీహార్ లో జరిగిన ఒక హత్య సంఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు టాక్ వినబడుతుంది. నాగ్ ఎప్పుడూ తన మూవీలో క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఈ మూవీలో తన క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు, ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లోనే రాబోతున్నట్లు ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.