Sarkar Live

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ దూకుడు మాములుగా లేదుగా..!

Tollywood News | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ ,లైగర్ (Family star, Ligar)లాంటి డిజాస్టర్ లు ఎదురైన కూడా తన

Vijay Devarakonda

Tollywood News | టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ ,లైగర్ (Family star, Ligar)లాంటి డిజాస్టర్ లు ఎదురైన కూడా తన మార్కెట్ మాత్రం ఏమాత్రం డౌన్ ఫాలో కాలేదంటే తనకున్న క్రేజ్ ఏంటో అర్థమవుతుంది. టాలీవుడ్ లో రౌడీ హీరో సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. డిఫరెంట్ మేనరిజంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు.తను తీసిన మూవీస్ లలో హిట్టు కొట్టినవి తక్కువే అయినా ఆడియన్స్ ను మెప్పించేలా తీశాడు. ప్రజెంట్ తన సినిమాల లైనప్ చూస్తే మతిపోయేలా ఉన్నాయి. బడా బ్యానర్ల లో సినిమాలు చేస్తూ క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాలపై మేకర్స్ అప్డేట్స్ ఇచ్చారు.

శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధన (roudy Janardhan) మూవీ ఒకటి కాగా మరొకటి శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యన్ (Rahul Sankruthyan) డైరెక్షన్లో మరో మూవీని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు మూవీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ లను మూవీ టీమ్స్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.దిల్ రాజు (Dil Raju) బ్యానర్ పై 59వ సినిమాగా వస్తున్న జనార్ధన రౌడీ మూవీని రవి కిరణ్ కోలా (Kiran kola) డైరెక్ట్ చేస్తున్నారు. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ పిరియాడిక్ డ్రామాగా రాబోతుంది.

మే 30న కింగ్ డమ్…

ఇదిలా ఉండగా సితార బ్యానర్ పై కింగ్డమ్ (kingdam)మూవీ మే 30న రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తన కెరీర్ లోనే ఒక మైలురాయి సినిమాగా నిలిచే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ పండితుల టాక్. ఇలా మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి టాలీవుడ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు మన రౌడీ హీరో.

మూడు పెద్ద బ్యానర్లలో Vijay Devarakonda

మూడు బడా బ్యానర్లపై ఈ మూవీస్ వస్తుండడం.. ఒకటి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో, మరొకటి సితార బ్యానర్ లో, ఇంకొకటి దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు రాబోతుండడంతో రౌడీ హీరో ఈ మూడు భారీ హిట్లు కొడితే తన రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం అంటున్నారు సినీ లవర్స్. ఒకవైపు వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న కూడా బడా బ్యానర్లపై సినిమాలు చేస్తుండడం రౌడీ హీరోకున్న క్రేజ్ ను తెలియజేస్తుంది. లేటెస్ట్ గా ఈ కొత్త సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను చూస్తే విజయ్ దేవరకొండ డిఫరెంట్ గా కనబడబోతున్నాడని అర్థమవుతుంది. రౌడీ హీరో ఫ్యాన్స్ ని మాత్రం కచ్చితంగా అలరించేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్న రౌడీ హీరో మరిన్ని క్రేజీ సినిమాలను తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!