తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజ్యసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల డిమాండ్లను పట్టించుకోకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. ఖాళీ స్థానాలను బీసీలకు కేటాయిస్తే వారి సమస్యలు జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్విమర్శించి భవిష్యత్తులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని నాయిని భరత్ హెచ్చరించారు.








