Sarkar Live

వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆయన విజయం కొత్తగూడెం గ్రామంతో పాటు సంగెం మండల ప్రజలకు గర్వకారణంగా మారింది.

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం వీరస్వామి, సోమలక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ వాసం శ్రీనివాస్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు.

2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై రసాయన శాస్త్రంలో జూనియర్ లెక్చరర్‌గా తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించారు. అనంతరం 2010లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది డిగ్రీ కళాశాలల్లో బోధన కొనసాగించారు. ఉన్నత విద్యారంగంలో బోధనతో పాటు పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తూ 2022లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు.

విద్యారంగంలో 15 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు 2024లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. అలాగే 2017లో రసాయన శాస్త్రంలో యువతరంగం రాష్ట్ర పురస్కారం అందుకున్నారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో రసాయన శాస్త్ర అంశాలను వివరిస్తూ తెలుగు అకాడమీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇంటర్మీడియట్ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు ఇతర ప్రచురణల్లో మొత్తం 12 పుస్తకాలు రచించారు.

టీ-శాట్, మన టీవీ వంటి శాటిలైట్ విద్యా ఛానళ్ల ద్వారా కూడా ఆయన పాఠాలు బోధించారు. బోధనతో పాటు పరిశోధనలోనూ చురుకుగా పాల్గొంటూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 25కు పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేసిన కాలంలో వైస్ ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ విభాగాధిపతిగా, పీజీ కోఆర్డినేటర్‌గా సేవలందిస్తున్నారు.

ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్‌తో పాటు అధ్యాపక బృందం ఆయనను అభినందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానం సాధించిన డాక్టర్ వాసం శ్రీనివాస్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కొత్తగూడెం గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?