Mallikarjun Kharge | బ్యాలెట్ పేపర్ కోసం మరోసారి జోడో యాత్ర
                    న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ కోసం భారత్ జోడో యాత్ర లాంటి ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge ) పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసిన రెండు రోజులకు ఖర్గే ప్రకటన చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు దీనిపై అవగాహన కల్పించడానికి భారత్ జోడో యాత్ర స్థాయిలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
తల్కతోరా స్టేడియంలో జరిగిన 'సంవిధాన్ రక్షక్ అభియాన్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కుల గణన అంటే ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందన్నారు. కుల గణనకు అనుమతిస్తే సమాజంలోని అన్ని వర్గాలు తమ వాటాను డిమాండ్ చేస్తారని మోదీ భయపడుతున్నారని అన్నారు.
బీజేపీకి రాజ్యాంగ సమగ్రత లేదని ఖర్గే ఆరోపించారు బ...                
                
             
								



