Sarkar Live

Day: November 27, 2024

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక
State

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక

Hyderabad Metro : హైదరాబాద్ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు దిల్లీకి పరిమితమైన ఈ సౌకర్యం హైదరాబాద్ కూ రానుంది. హైదరాబాద్ లో పెరిగిన రద్దీ కారణం కాగా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో చేరనుంది. ఇది మియాపూర్ నుంమ్ర్ పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుంమ్ర్ ఎయిర్ పోర్ట్ వ...
Food Poisoning | స్కూళ్ల‌లో ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్‌
Crime

Food Poisoning | స్కూళ్ల‌లో ఫుడ్‌పాయిజ‌న్ ఘ‌ట‌న‌పై హైకోర్టు సీరియ‌స్‌

Food Poisoning | హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురి అయిన ఘ‌ట‌న‌పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. వెంట‌నే ఆయా పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజనం నమూనాలను ల్యాబ్‌ల కు పంపించాల‌ని ఆదేశించింది. నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజనింగ్‌పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీసిన హైకోర్టు.. ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోతే మాత్రం స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల‌కు కూడా పిల్లలు ఉన్నారని.. మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అధికారులకు త‌లంటింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడంపై కోర్టు ప్రభుత్వాన్ని కూడా నిలదీసింది. ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని వొచ్చే సోమవారంలోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల వ్యవధిలో ఇదే పాఠశ...
Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి
State

Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి

Telangana | వాణిజ్య వ్యాపారాలు విస్తరించేందుకు మంథని మంచిర్యాల ప‌ట్ట‌ణాల‌ను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని ఐటి, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) వెల్ల‌డించారు. బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో యువకులకు ఉపాధి కల్పించేందుకు చిన్న సాఫ్ట్ వేర్‌ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువస్తామ‌ని తెలిపారు. అలాగే మంథ‌ని స‌మీపంలోని రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధ‌ర్‌బాబు హామీ ఇచ్చారు. మంథని సమీపంలో గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రూ. 2 కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టనున్న‌ట్లు తెలిపారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అవసరమైన...
Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..
National

Fengal Cyclone Alert | ఫెంగల్ తుఫాను ముప్పు.. పాఠ‌శాల‌ల‌కు సెల‌వు..

Fengal Cyclone Alert | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం తుఫానుగా మార‌నుంద‌ని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను దేశాన్ని తాకబోతోంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా వస్తూ.. తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది. ఈదురు గాలులతో కూడా అతి భారీ వర్షాల పడతాయని వెల్లడించింది. తుపాను నేపథ్యంలో ఈరోజు తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని డిఎంకే ప్రభుత్వం ఆదేశించింది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చ...
Tirumala Temple |  తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్
Crime

Tirumala Temple | తిరుమల హుండీలో డబ్బులు చోరీ చేసిన భక్తుడు అరెస్ట్

Tirupati: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమ‌ల దేవాలయం (Tirumala Temple )లో ఓ భక్తుడు హుండీలో డబ్బును దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన నవంబర్ 23న చోటుచేసుకోగా ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదుతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన వేణు లింగం అనే నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు అతని నుంచి రూ.15,000 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యిందని, సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన ఆల‌య సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో హుండీ చుట్టూ టీటీడీ భద్రతను మ‌రింత‌ కట్టుదిట్టం చేశారు. కాగా, ప్...
error: Content is protected !!