Uttam Kumar Reddy | రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి సాగు
                    Telangana |  దేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణలో 66.7లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇది వ్యవసాయానికి సంబంధించి  అతిపెద్ద రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు రోజుల రైతు పండగలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.  రేపు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రైతు పండుగ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన  స్టాళ్లను పరిశీలించారు. అనంతరం అవగాహన సదస్సులో మంత్రి ఉత్తమ్ కుమార్  మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అందుకే రైతులు పండగ చేసుకుంటున్నారని తెలిపారు.
రైతులకు మంచ...                
                
             
								



