NHAI | టోల్ వసూలులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది, ప్రైవేట్ కంపెనీలు ఎంత సంపాదించాయి?
NHAI | న్యూఢిల్లీ : 2000లో ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి హైవేలపై ప్రయాణికుల నుంచి దాదాపు రూ.2.1 లక్షల కోట్లను యూజర్ ఫీజుగా వసూలయ్యాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి కేంద్రం భారీ మొత్తంలో నిధులను ఖర్చుచేస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు అంచనా.
కాగా గత 24 ఏళ్లలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్మించిన రహదారుల కోసం ప్రైవేట్ హైవే నిర్మాణ కంపెనీలు సుమారు రూ. 1.4 లక్షల కోట్ల టోల్ వసూలు చేశాయని మంత్రిత్వ శాఖ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ స్ట్రెచ్‌లలో, NH-48 పరిధిలోని గుర్గావ్-జైపూర్ కారిడార్ యూజర్ ఛార్జీల రూపంలో దాదాపు రూ. 8,528 కోట్లు వసూలు చేసింది.
టోల్ సేకరణలో UP నంబర్ 1
ప్రైవేట్ కంపెనీలు PPP కింద రహదారుల నిర్మాణాన...

