Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల భారీ ఫ్లైఓవర్
నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అరాంఘర్ ఫ్లైఓవర్
Aramghar to Zoo Park Flyover | నిత్యం ట్రాఫిక్ కష్టాలలో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అరాంఘర్ సిక్స్ లేన్ ఫ్లైఓవర్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ భారీ ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది హైదరాబాద్ లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్. 24 మీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 636 కోట్ల ఖర్చు చేశారు. ఫ్లైఓవర్‌కు రెండువైపులా ఎనిమిది కిలోమీటర్ల సర్వీస్ రోడ్డు పూర్తి చేయడమే ప్రాజెక్టులో అతి పెద్ద సవాల్. ఈ రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి సర్వీస్ రోడ్‌ను చకచకా నిర్మిస్తున్నారు.ఫ్లైఓవర్ పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి.
హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులతో ...




