Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు
Ramagundam | పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు (Tharmal Power Plants ) నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు.
కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార...




