Outsourcing Jobs | అంగట్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు…?
                    ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మెడికల్ కాలేజీలోని ఔట్ సోర్సింగ్ 
 	ఉద్యోగాలు అమ్ముతున్న ఏజెన్సీ..
 	నోటిఫికేషన్ ఉండదు... నిబంధనలు పాటించరు..?
 	ఉద్యోగాల పేరుతో దందా... రంగంలోకి దళారులు
 	76 పోస్టులను భర్తీ చేసే క్రమంలో కోటికి పైగానే చేతులు మారినట్లు ఆరోపణలు
 	నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ
Warangal | సరుకులు కావాలంటే అంగట్లో దొరుకుతాయి. అదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు (Outsourcing Jobs) కావాలంటే మాత్రం ఆ ఏజెన్సీ వద్ద మాత్రమే దొరుకుతాయని ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదేంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు పొందాలంటే సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి.. అప్పుడే కదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వస్తుంది అని మీరు భావిస్తున్నారా? మరి వీరేంటి అంగట్లో సరుకులు దొరికినట్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు లభిస్తాయంటున్నారు? అని ఆశ్చర్యపో...                
                
             
								



