Sarkar Live

Day: December 7, 2024

రేపటి నుంచి నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్స్ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
National

రేపటి నుంచి నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్స్ కోసం ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

Army Agniveer Recruitment Rally | హైదరాబాద్: తెలంగాణ నుంచి అగ్నివీర్ నియామ‌కాల కోసం ఇండియ‌న్ ఆర్మీ డిసెంబర్ 8 నుంచి 16 వరకు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించ‌నుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, , పుదుచ్చేరి లోని మహిళా మిలిటరీ పోలీసుల (డబ్ల్యుఎంపి)ని కూడా ఎంపిక చేసేందుకు ర్యాలీ నిర్వహించనున్నారు. . పోస్టుల వివ‌రాలు అభ్యర్థులు అగ్నివీర్- జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (X క్లాస్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (తరగతి VIII పాస్) అగ్నివీర్​ జనరల్​ డ్యూటీ, అగ్నివీర్​ టెక్నికల్​, అగ్నివీర్​ క్లర్క్​/స్టోర్​ కీపర్ ఉద్యోగాలకు అభ్య‌ర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక అగ్నివీర్​ ట్రెడ్స్​ మెన్​కు కేవ‌లం 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ర్య...
కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి
State

కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా Hyderabad :  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు తమదే అధికారం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా  (JP Nadda) అన్నారు.  దేశంలోని  విపక్ష పార్టీలన్నీ ఏకమైనా.. మూడోసారి కూడా ప్రజలు మోదీ(PM Modi)నే ప్రధానిగా ఆమోదించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి మరో ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని సూచించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో శనివారం జ‌రిగిన‌ బీజేపీ భారీ బహిరంగ సభలో జెపి.నడ్డా మాట్లాడుతూ..  ఆరు గ్యారెంటీలు, 66 అబద్ధాలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అనే సంగతి తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్‌ (Con...
ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌
Business

ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌

Vodafone Idea | భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలో వినియోగదారులను కోల్పోతూ వ‌స్తోంది. ప్రతి నెలా, వందల వేల మంది కస్టమర్‌లు విడిచివెళ్లిపోతున్నారు. తక్కువ నెట్‌వర్క్ కవరేజ్, కనెక్టివిటీ సమస్యల కారణంగా తరచుగా ఇతర ప్రొవైడర్‌లకు మారుతున్నారు. మ‌రోవైపు టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో వినియోగ‌దారులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వినియోగదారులకు ఊరట కలిగించేలా వొడఫోన్ ఐడియా ఓ గుడ్ న్యూస్ చెప్పంది. ఈ టెలికాం కంపెనీ ఇటీవల తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరిచింది. ఈ విషయంలో Jio Airtel రెండింటినీ అధిగమించింది. Vi 4G కవరేజ్ 4G నెట్‌వర్క్ నాణ్యత పరంగా, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రతి గంటకు 100 మొబైల్ టవర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఓపెన్ సిగ్నల్ ఇటీవలి నివేదిక ప్రకారం, 4G కవరేజ్ విషయానికి వస్తే, Vodafone ...
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవ‌ర‌కు పోరాటం
State

KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవ‌ర‌కు పోరాటం

Hyderabad | లగచర్ల (Lagacharla) భూసేకరణ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భ‌రోసా ఇచ్చారు. భూసేక‌ర‌ణ ర‌ద్దు చేసేవ‌ర‌కు పోరాటం ఆప‌బోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు శ‌నివారం ల‌గ‌చ‌ర్ల బాధితులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో బాధితుల‌కు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వేధింపులను ఇప్ప‌టికైనా మానుకొని బాధితుల డిమాండ్లను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యే వ‌ర‌కూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంద‌ని కేటీఆర్ వారితో అన్నారు. గిరిజన భూసేకరణ బాధితులపై రేవంత్ (CM Revanth Reddy) ప్ర‌భుత్వం అన్యాయంగా పెట్టిన కేసులను భేషరతుగా ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. పోలీసుల ద్వారా ల‌గ‌చ‌ర్ల‌ బాధితుల‌ను వేధించడం నిలి...
Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Business

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో త‌ర‌చూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ‌గా, ఈరోజు మాత్రం తగ్గుముఖం ప‌డ్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గగా, కిలో వెండి రేటు కూడా రూ.200 త‌గ్గింది. నేటి ధరలు ఇవే.. శ‌నివారం డిసెంబర్ 7న ఉదయం 6.25 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,610 కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర రూ. 71,140 ప‌లికింది. మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 760కి ప‌ల‌క‌గా, 22 క్యారెట్ల బంగారం రేట్ 10 గ్రాములకు రూ. 71,290కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రా) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్) ఢిల్లీలో ర...
error: Content is protected !!