Sarkar Live

Day: December 8, 2024

KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్
State

KCR | కాంగ్రెస్ మూర్ఖ‌త్వానికి ప‌రాకాష్ట‌.. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై కేసీఆర్ ఫైర్

KCR | తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయ‌డం కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూర్ఖత్వమని.. ఇవి ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అని బీఆర్‌ఎస్ అధినేత, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ఆయ‌న‌ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్ర‌వ్నించారు. రాష్ట్ర‌ ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు. రైతుబంధు ప్రయోజనాలు ప్ర‌జ‌ల‌కు వివరించాలని ఎమ్మెల్యేలు, ఎమ...
Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్
Sports

Ind vs Ban U19 Asia Cup 2024 | ఆసియా కప్ 2024.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైన భారత్

Ind vs Ban U19 Asia Cup 2024 | క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది ఆసియా కప్ ఫైనల్ లో భారత్ పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. నేడు జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ జట్టు భారత్ పై 59 పరుగుల తేడాతో గెలుపొందింది.మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 198 పరుగులు చేయగా నిర్ణీత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భారత క్రికెటర్ లు తడబడ్డారు. ఈ మ్యాచ్ లో బంగ్లా క్రికెటర్ లు పూర్తి ఆధిపత్యాన్ని చేలాయించి భారత జట్టును కేవలం 139 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో బంగ్లాదేశ్ అండర్-19 విభాగంలో 2024 ఆసియా కప్ విజేతగా చరిత్ర సృష్టించింది.   బంగ్లాదేశ్ (Bangladesh) లో తలపడిన భారత జట్టు 59 పరుగుల తేడాతో  ఓటమిని చవిచూసింది.199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు కుప్పకూలిపోయింది. మహ్మద్ అమన్ (26 పరుగులు), హార్దిక్ రాజ్ (...
Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం
State

Trains Stopped | సిగ్న‌ల్స్‌లో సాంకేతిక స‌మ‌స్య‌.. ప‌లు రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

Trains Stopped : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్స్​లో ఏర్ప‌డిన సాంకేతిక సమస్యతో పలు ట్రైన్స్ రాకపోకలకు అంత‌రాయం క‌లిగింది. హైదరాబాద్‌ నుంచి నాగ్‌పుర్‌ వెళ్లే వందే భారత్‌, దిల్లీ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు అరగంట పాటు నిలిచిపోవాల్సి వ‌చ్చింది .సిర్పూర్ కాగజ్​నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​లు గంటన్నర పాటు నిలిచిపోయాయి. దీంతో ప‌లు రైళ్ల‌లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక సింగరేణి ప్యాసింజర్‌ ఉప్పల్‌ స్టేషన్‌లో 20 నిమిషాలు నిలిచిపోయింది.మెయిన్‌లైన్‌లో ఒక‌ గూడ్స్‌ రైలు ఆగింది. మరోవైపు సిగ్న‌ల్ సమస్య కారణంగా ఉప్పల్‌ ఆర్వోబీ సమీపంలో రైల్వే గేటు తెరుచుకోలేదు. ఫ‌లితంగా ఇరువైపులా రోడ్ల‌పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రెండు వైపులా గేట్లు తెరుచుకోకపోవడంతో హుజూరాబాద్ ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు సైతం స్తంభించిపోయాయి. &nb...
వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు కానిస్టేబుల్స్ మృతి
Crime

వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు కానిస్టేబుల్స్ మృతి

Accident | గజ్వేల్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళుతుండ‌గా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ఆదివారం తెల్లవారుజామున ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియ‌ని వాహ‌నం వేగంగా వ‌చ్చి వెనుక నుంచి ఢీ కొట్టి పోయింది .దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్క‌డికక్క‌డే మృతిచెందారు. కాగా మృతుడు ప‌రందాములు స్వ‌గ్రామం సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు కాగా, వెంక‌టేశ్ స్వ‌గ్రామం గాడిచర్లపల్లి. మృతులు వెంకటేష్, పరంధాములు ప్ర‌స్తుతం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఊహించ‌ని విధంగా ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి ...
Pushpa 2 box office : అల్లు అర్జున్ సినిమా రికార్డుల జాత‌ర.. 3 రోజుల్లో 600 కోట్ల మార్క్‌
Cinema

Pushpa 2 box office : అల్లు అర్జున్ సినిమా రికార్డుల జాత‌ర.. 3 రోజుల్లో 600 కోట్ల మార్క్‌

Pushpa 2 box office | అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ నటించిన ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ.. గ‌త సినిమాల వసూళ్ల రికార్డుల‌ను మూడు రోజుల్లోనే అధిగమించింది. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా రూ. 600 కోట్లకు చేరుకున్న భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ప్రాథ‌మిక‌ అంచనాల ప్రకారం ఈ సినిమా మూడు రోజుల్లో ఇండియాలో రూ.383 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం భారతదేశంలో దాదాపు రూ. 115.58 కోట్ల నికర వసూళ్లు సాధించింది. శుక్రవారం వసూళ్లను అధిగమించి మొత్తం రూ. 383.7 కోట్లకు చేరుకుంది. హిందీ వెర్షన్ అత్యధికంగా రూ.73.5 కోట్లు, తెలుగు వెర్షన్ రూ.31.5 కోట్లు, తమిళ వెర్షన్ రూ.7.5 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం నాడు పుష్ప 2 రూ.93.8 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. పుష్ప: ది రూల్...
error: Content is protected !!