Sarkar Live

Day: December 9, 2024

Group-2 Hall Tickets | గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల.. డౌన్​లోడ్ చేసుకోండిలా..!
State

Group-2 Hall Tickets | గ్రూప్-2 పరీక్ష హాల్​టికెట్లు విడుదల.. డౌన్​లోడ్ చేసుకోండిలా..!

Group-2 Hall Tickets Realesed : గ్రూప్​-2 పరీక్ష హాల్​టికెట్లను టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. ఈమేర‌కు హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకోవాల‌ని అభ్యర్థులకు సూచించింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ​ ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సుమారు 5.51లక్షల దరఖాస్తులు అందాయి. రెండు రోజులు ప‌రీక్ష‌లు రెండు రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం మొత్తం నాలుగు పేపర్లతో గ్రూప్‌-2 పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. ఉదయం పేపర్​ -1, పేపర్​-3లకు 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకు అభ్యర్థులను ప‌రీక్ష కేంద్రాల్లోకి ​అనుమతిస్తారు. ఒక్క నిమిషం నిబంధ‌న అమ‌లు ఉంద‌ని అభ్య‌ర్థులు గ‌మ‌నించాలి. హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ టీజీపీఎస్సీ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను న‌మోదు చేయా...
farmers protest : నిర‌స‌న‌ల్లో అనేక మ‌లుపులు.. రైతుల ఆందోళ‌న.. ఉద్రిక్త‌త‌
National

farmers protest : నిర‌స‌న‌ల్లో అనేక మ‌లుపులు.. రైతుల ఆందోళ‌న.. ఉద్రిక్త‌త‌

farmers protest : కేంద్ర వైఖ‌రికి చేప‌ట్టిన రైతుల ఆందోళ‌న అనేక మ‌లుపులు తిరుగుతోంది. పంట‌ల మ‌ద్ద‌తు ధ‌రకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డంతోపాటు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ రైతులు నాలుగేళ్లుగా ఆందోళ‌న‌బాట పట్టిన విష‌యం విదిత‌మే. పంజాబ్‌, హ‌ర్యానా, యూపీ స‌హా ప‌లు రాష్ట్రాలకు చెందిన రైతులు సమ్యూక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాగా ఏర్ప‌డి నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 13 నుంచి పంజాబ్-హ‌ర్యానా, శంబూ-ఖ‌నౌరి స‌రిహ‌ద్దులో మ‌కాం వేశారు. ఇదే క్ర‌మంలో నిర‌స‌న‌ల్లో భాగంగా రైతులు చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. వారి ఢిల్లీ మార్చ్‌ను భ‌ద్ర‌తా సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్ర‌క్త‌త నెల‌కొంది. పార్లమెంట్ ఎదుట నిరసనకు బయల్దేరిన‌ యూపీకి చెందిన రైతులను నొయిడా సరిహద్దుల్లో అడ్డుకోవడం, దీంతో అన్న‌దాత‌లు ఆందోన‌కు దిగ‌డంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసుల ఆంక్షల ...
Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ
State

Telangana Assembly | అసెంబ్లీ స‌మావేశాలు వాయిదా.. తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్ పై చర్చ

Telangana Assembly | హైద‌రాబాద్ : రాష్ట్ర‌ శాస‌న స‌భ‌, మండలి స‌మావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా ప‌డ్డాయి. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సంబంధించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రక‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై స‌భ్యులు మాట్లాడిన త‌ర్వాత స‌భ‌ను డిసెంబ‌ర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ ప్ర‌క‌టించారు. అయితే అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. బీఆర్ఎస్ నాయ‌కుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ నేత‌లు నిప్పులు చెరిగారు. అక్ర‌మ అరెస్టుల‌పై మండిప‌డ్డారు. అదానీ – రేవంత్ దోస్తానాపై ప్ర‌శ్నిస్తామ‌నే భ‌యంతోనే త‌మ‌ను అడ్డుకుంటున్నార‌ని, స‌భ‌లోని రానివ్వ‌డం లేద‌ని బీఆర్ఎస్ నేత‌లు విమ‌ర్శించారు. కాగా రాష్ట్ర సచివాలయంలో రీడిజైన్ చేసిన...
Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం
National

Congress | విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు… రాజ‌కీయ శిబిరంలో క‌ల‌క‌లం

Financial benefits to Congress from a foreign organization : విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఆ పార్టీలో ప్రకంప‌ణ‌లు సృష్టిస్తున్నాయి. జార్ట్ సోరోస్ ఫౌండేష‌న్ నిధుల‌తో న‌డిచే సంస్థ‌తో సోనియాగాంధీ సత్సంబంధాలు క‌లిగి ఉన్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో విదేశీ సంస్థ‌తో కాంగ్రెస్‌కు ఆర్థిక ప్ర‌యోజ‌నాలు చేకూరుతున్నాయ‌ని తేట‌తెల్ల‌మైంద‌ని విమ‌ర్శిస్తోంది. దీన్ని కాంగ్రెస్‌తోపాటే అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు తోసిపుచ్చారు. దీన్ని కూడా బీజేపీ త‌ప్పుప‌డుతోంది. విప‌క్షాలతో క‌లిసి భార‌త్‌ను అస్థిర ప‌ర్చేందుకు విదేశీయులు కుట్ర ప‌న్నుతున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని అభివ‌ర్ణించింది. కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కురాలు, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీపై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ...
Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…
Special Stories

Paddy Procurement | రైతులకు కోత.. అధికారులకు మేత…

తరుగు పేరుతో రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోతపెడుతున్నట్లు సమాచారం మామూళ్ల అలవాటు పడి చూసిచూడనట్లగా కొందరు అధికారులు! తరుగు పేరుతో తీసిన ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళుతోంది? ఆ డబ్బులు ఎవరు మింగుతున్నారు? Paddy Procurement | రైతులు ఆరుగాలం పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో బస్తాకు 2 నుంచి 5 కిలోల వరకు కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై దోచుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన అధికారులే మిల్లర్లు ఇచ్చే మామూళ్లకు (మేతకు) అలవాటు పడి చూసీచూడనట్ల వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంతమంది పౌరసరఫరాల శాఖ అధికారుల మూలంగా మసకబార...
error: Content is protected !!