Govt Schools | పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఫొటోలను ప్రదర్శించాల్సిందే..
                    Teachers Photos in Govt Schools |తెలంగాణలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న టీచర్ల ఫొటోలను అందరికీ కనిపించేలా ప్రదర్శించాలని.. పాఠశాల విద్యాశాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలిచ్చారు.
కొన్ని పాఠశాలల్లో ప్రభుత్వం నియమించిన ఉపాధ్యాయులకు బదులు ఇతర ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నానే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై విద్యాశాఖకు పలుమార్లు ఫిర్యాదులు వచ్చాయని నరసింహారెడ్డి వెల్లడించారు. ఇలా ఒకరికి బదులు మరొకరు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే వెంటనే కఠిన చర్యలు ...                
                
             
								



