Sankranti Special Trains : సంక్రాంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే..
Sankranti Special Trains : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. దీంతో సంక్రాంతి ప్రయాణ ఇబ్బందులు తీరనున్నాయి. ఆ ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ..
సికింద్రాబాద్, విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలును నడుపుతోంది. 07097, 07098 నంబర్లతో ఈ ట్రైన్ ప్రతీ ఆది, సోమవారాల్లో అందుబాటులో ఉండనుంది. ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ఇది సికింద్రాబాద్ స్టేషన్ లో బయలుదేరుతుంది. వైజాగ్ నుండి సోమ వారాల్లో సాయంత్రం 7.50 గంటలకు స్టార్ట్ అయి తరువాత రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ...


