Allu Arjun Bail | జైలుకు కాదు.. ఇంటికే..
Allu Arjun Bail : హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. రాష్ట్ర హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ వచ్చింది. హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్ అభిమానులు, అల్లు, మెగా స్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని 34 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను ఏ11 నమోదు చేసి ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలులో విచారణ...




