Diabetes | డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో పెరుగుతున్న షగర్ పేషంట్స్..
                    Diabetes  | తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్రస్తుతం షుగర్ పేషెంట్ల సంఖ్యలో మన రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మధుమేహ రోగులు ఉన్నారు. ఈ విషయం కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో వెల్లడియింది. అసంక్రమిత వ్యాధుల (NCD) పోర్టల్ ప్రకారం 2024 నవంబర్ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ లెక్కలను అందులో ప్రస్తావించింది.
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు నిండిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ బ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ పరీక్షలు చేశారు. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్, మహారాష్ట్ర ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి టెస్ట్ చేయగా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) డయాబెటి...                
                
             
								



