Christmas Special Trains : క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
Christmas Special Trains : క్రైస్తవులకు అతిపెద్ద పండుగ అయిన క్రిస్మస్ వచ్చిందంటే చాలు పెద్ద సంఖ్యలో ప్రత్యేక ప్రాంతాలకు వెళ్తుంటారు. దేశంలో ప్రసిద్ధి గాంచిన విల్లుపురం(Villupuram), బ్రహ్మపూర్ (Brahmapur) ప్రాంతాలను సందర్శిస్తారు. తమిళనాడులో గల విల్లుపురానికి ఎంతో చరిత్ర ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి భారీగా సందర్శకులు వస్తారు. విల్లుపురంలోని చర్చిలలో ఏటా కరోల్ గానంతో సహా ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. ఇవి ఇక్కడికి వచ్చే క్రైస్తవులు ఎంతో ఇష్టపడతారు.సామూహిక ప్రార్థనలు, భోజనాలు, వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. బ్రహ్మపూర్‌లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ జనాభా ఉంది. ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా చర్చి సేవలు, ఊరేగింపులు వంటివి ఘనంగా జరుగుతాయి.
క్రిస్మస్ (Christmas) సందర్భంగా ప్రత్యేక రైళ్లు..
...




