COVID-19 Scam | కొవిడ్ పరికరాల స్కాం కేసులో సంచలన విషయాలు..
COVID-19 Scam Case : కర్ణాటకలో కరోనా మహమ్మారి సమయంలో వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఇది చోటుచేసుకుందని ఫిర్యాదు అందడంతో ఈ మేరకు కేసు నమోదైంది.
రూ. 167 కోట్ల కుంభకోణం
కోరానా మహమ్మారి సమయంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు, N-95 మాస్కుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని, దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 167 కోట్ల నష్టం వాటిల్లిందని కర్ణాటక వైద్య విద్యా డైరెక్టరేట్ (DME) కు చెందిన ఎం. విష్ణు ప్రసాద్ చేసిన ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణంలో పూర్వ DME డైరెక్టర్ పి.జి. గిరీష్, ఆఫీసర్లు జి.పి.రఘు, ఎన్. మునిరాజు ప్రమేయం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 14న వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ రాకీయ నాయకుడిని కూడా నిందితుడిగా పేర్కొనలేదు.ఈ వార్త...



