Sarkar Live

Day: December 16, 2024

Road Collapsed | రోడ్డు మ‌ధ్య‌లో ఒక్కసారిగా 20 అడుగుల భారీ గొయ్యి.. కంగుతిన్నస్థానికులు..  ఎక్కడో తెలుసా..!
Trending

Road Collapsed | రోడ్డు మ‌ధ్య‌లో ఒక్కసారిగా 20 అడుగుల భారీ గొయ్యి.. కంగుతిన్నస్థానికులు.. ఎక్కడో తెలుసా..!

Road Collapsed in Lucknow | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విస్తుపోయే ఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నో(lucknow)లో రోడ్డు మధ్యలో కుంగిపోయింది(Road Caves In ). దీంతో ఒక్క‌సారిగా 20 అడుగుల లోతైన భారీ గొయ్యి ఏర్పడ‌డంతో అక్క‌డున్న‌వారు భయాందోళనకు గుర‌య్యారు. దీని సంబంధించి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఆ రోడ్డు కు రెండు వైపులా బారికేడ్లు పెట్టి వాహ‌నాలు అటువైపు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఫ‌లితంగా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సోమ‌వారం ఉద‌యం ఈ సంఘటన చోటుచేసుకుంది. వికాస్ నగర్ ప్ర‌ధాన ర‌హ‌దారి వెంట‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందున్న రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్క‌డ ఏర్ప‌డిన 20 అడుగుల లోతులో పెద్ద గొయ్యి చూసి స్థానికులు భయాందోళనకు గుర‌య్యారు. అయితే మంద‌స్తుగా అక్క‌డ బారికేడ్లు ఏర్పాటుల చేయ‌డ...
food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌
Business

food Delivery| క్విక్ ఫుడ్ డెలివ‌రీ మార్కెట్‌పై షాకింగ్ కామెంట్స్‌

Shantanu Deshpande comments on food Delivery : భార‌త‌దేశంలో ఫుడ్ డెల‌వ‌రీ కంపెనీలు, వాటికి అల‌వాటు ప‌డిన వినియోగ‌దారుల‌పై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శాంతాను దేశ్‌పాండే సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌రిత ఆహార స‌ర‌ఫ‌రా (క్విక్ డెలివ‌రీ) అనేది ఆరోగ్యాన్ని దెబ్బ‌తీసే చ‌ర్య అని అభివ‌ర్ణించారు. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం భార‌త్‌లో పెరుగుతోంద‌ని, దీని వ‌ల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. లింక్డ్‌ఇన్‌లో తన అభిప్రాయాలను ఆయ‌న ఇలా వ్య‌క్త‌ప‌రిచారు. పోష‌కాహారాన్ని మ‌ర‌చిపోయామ‌ని ఆవేద‌న‌ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం వల్ల ఆరోగ్య‌ప‌ర‌మైన పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామ‌ని శాంతాను అన్నారు. ఇవి ఎక్కువగా పామాయిల్, చక్కెరతో నిండి ఉంటాయ‌ని తెలిపారు. మ‌నం ఆహార దిగుబ‌డికి మాత్ర‌మే ప్రాధాన్య‌మిస్తున్నామ‌ని, పోష‌క విలువ‌ల‌ను ప‌ట్ట...
Cold wave | తెలంగాణలో చలి పులి.. క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు
State

Cold wave | తెలంగాణలో చలి పులి.. క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు

Cold wave : తెలంగాణలో చలి తీవ్రంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాద్, భీంపూర్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే విధంగా పోచార, భోరాజ్, తండ్రా ప్రాంతాల్లో 6.4 నుంచి 6.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6.3 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా చ‌లి తీవ్రంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రతంగా ఉంటుంద‌ని భారత వాతావరణ శాఖ (IMD) ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ (Cold wave ) Cold wave in Hyderabad : హైదరాబాద్ నగరంలో కూడా చలితీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న...
Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..
National

Parliament Winter Session | బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌.. పార్ల‌మెంట్‌లో మాటల మంటలు..

Parliament Winter Session : పార్ల‌మెంట్ శీతాకాల సమావేశంలో ఉభ‌య స‌భ‌లు వాడీవేడిగా సాగుతున్నాయి. రాజ్యసభలో విపక్షాలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజ్యసభ రెండు రోజుల రాజ్యాంగ చర్చను నిర్వహిస్తోంది. భారత రాజ్యాంగం ఆమోదానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వం వహిస్తున్నారు. పార్లమెంట్లో వాడీవేడి చ‌ర్చ‌ శుక్రవారం, శనివారం రెండు రోజుల‌పాటు లోక్‌సభ (Lok sabha)లో రాజ్యాంగంపై చర్చ జరిగింది. సోమ‌వారం కూడా వాడివేడిగా సాగింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ త‌న‌ ప్రసంగంలో రాజ్యాంగాన్ని రక్షణ కవచంగా అభివ‌ర్ణించారు. రాజ్యాంగంపై వీర్ సావర్కర్ విమర్శలను ఉదహరిస్తూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్ర‌తిస్పందిస్తూ నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్...
RG Kar case | మళ్లీ మొదటికొచ్చిన ఆర్‌జి క‌ర్‌  ఆస్పత్రి కేసు..
Crime

RG Kar case | మళ్లీ మొదటికొచ్చిన ఆర్‌జి క‌ర్‌ ఆస్పత్రి కేసు..

RG Kar case updates : కోల్‌క‌తాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌లో వైద్యురాలి హ‌త్యాచారం ఘ‌ట‌న‌పై నిర‌స‌న‌లు ఉధృత‌మయ్యాయి. ప‌శ్చిమ బెంగాల్ సంయుక్త వైద్యుల వేదిక (WBJPD) దీక్ష‌ల‌కు పూనుకుంటోంది. డిసెంబర్ 19 నుంచి కోల్‌కతా నడిబొడ్డున నిరసన దీక్ష ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. లేడీ డాక్ట‌ర్‌ హ‌త్యాచారం కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ మంజూరు చేయడంపై WBJPD మండిప‌డుతోంది. ఈ ఘ‌ట‌న‌పై 90 రోజుల లోపు చార్జ్‌షీట్ సమర్పించడంలో సీబీఐ విఫలం కావ‌డం వ‌ల్లే నిందితులు బెయిల్ పొంద‌గ‌లిగార‌ని ఆరోపిస్తోంది. సీబీఐ చార్జ్‌షీట్‌లో జాప్యం వైద్యురాలిని అత్యాచారం చేసి హ‌త్య చేయ‌డంపై ఐదు వైద్యుల సంఘాల సమాఖ్య WBJPD డిసెంబరు 26 వరకు కోల్‌కతాలోని డోరీనా క్రాసింగ్ వద్ద ఈ నిరసనను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఘ‌ట‌న‌పై సీబీఐ ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని, కేసులో అదనపు చార్జ్‌షీట్ వెంటనే సమర్పించాలని డిమాండ్...
error: Content is protected !!