Liquor Revenue | తెలంగాణకు మద్యం కిక్కు.. లిక్కర్ అమ్మకాలతో రూ.20వేల కోట్ల రాబడి
                    Liquor Revenue | తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ విక్రయాల్లో ప్రభుత్వానికి ఎనిమిది నెలల్లోనే రూ.20,903.13 కోట్ల ఆదాయం వొచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ సవంత్సరం ఏప్రిల్ నెల నుంచి నవంబరు వరకు ఎక్సైజ్ శాఖకు మద్యం అమ్మకాలపై రెవెన్యూ రూపంలో రూ.10,285.58 కోట్లు, అలాగే పన్నుల రూపంలో రూ.10,607.55 కోట్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ శాసన సభలో వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిక్ష బిఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎక్సైజ్ శాఖ సమాధానమిచ్చింది. రాష్ట్రంలో అక్రమ లిక్కర్ అమ్మకాలను నియంత్రిస్తున్నామని, ఎప్పటికప్పుడు అనధికారిక మద్యం విక్రయిస్తున్నవారిపై కేసులు పెడుతున్నామని చెప్పారు.
TG Liquor Cases : ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నాటికి అనధికారిక విక్రయాలపై 6,915 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.ఈ కేసుల్లో 6,728 మందిని అరెస్టు చేసి 74,425 లీటర్ల లిక్కర్, 353 వాహనాలను జప్తు చే...                
                
             
								



