Real Estate | భారతదేశంలో రికార్డు స్థాయి పెట్టుబడులు
                    Real Estate in India : భారతదేశంలో ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడులు కొత్త రికార్డును సృష్టించాయి. 2023తో పోలిస్తే 51 శాతం అధికంగా ఉండగా, మొత్తం పెట్టుబడులు $8.9 బిలియన్‌కు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం 63 శాతంగా ఉండటం విశేషం.
రియల్ ఎస్టేట్ రంగంలో సంస్థాగత పెట్టుబడుల ఈ పెరుగుదుకు శక్తిమంతమైన ఆర్థిక అభివృద్ధి, రాజకీయ స్థిరత్వం, ప్రభుత్వ విధానాల వల్ల ఏర్పడిన పారదర్శకత ముఖ్య కారణాలు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2007లో నమోదైన పాత రికార్డు ($8.4 బిలియన్)తో పోలిస్తే ఇది 6 శాతం అధికం. JLL నివేదిక ప్రకారం, 2023తో పోలిస్తే 2024లో పెట్టుబడులు 51 శాతం అధికమయ్యాయి.
Real Estate లో విదేశీ పెట్టుబడిదారుల కీలక పాత్ర
నివేదికల ప్రకారం మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో 63 శాతం విదేశీ పెట్టుబడిదారులవే. మిగతా 37 శాతం దేశీయ పెట్టుబడులుగ...                
                
             
								



