H-1B visa | భారతీయులకు ఊరట.. వీసా నిబంధనల్లో సడలింపు
US H-1B visa : హెచ్-1బీ వీసాల నిబంధనలను అమెరికా ప్రభుత్వం సడలించింది. కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ముఖ్యంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసా నుంచి హెచ్-1బీ వీసాలోకి సులభంగా మార్చుకొనే అవకాశాన్ని కల్పించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు పెద్ద ఊరట కలగనుంది. స్టూడెంట్ వీసా నుంచి హెచ్-1 వీసాలోకి మార్చుకొనే వెసులుబాటుతో తాము అనేక గొప్ప అవకాశాలు పొందొచ్చనే హర్షం వ్యక్తమవుతోంది.
H-1B visa అంటే ఎందుకింత క్రేజ్?
America Visa : హెచ్-1బీ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలకు అవకాశం దీని ద్వారా ఉంటుంది. అత్యంత ఆధునిక సాంకేతికత నైపుణ్యాలను కలిగిన వారిని భారత్, చైనా లాంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పెద్దఎత్తున నియమించుకోవడంలో ఈ వీసా కీలక పాత్ర...


