Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైదరాబాద్‌లో మళ్లీ కూల్చివేతలు
Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) తన జోరును పెంచింది. అక్రమ కట్టడాల కూల్చివేతలను ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీ (Manikonda Municipality) పరిధిలోని అనురాగ్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ ప్రాపర్టీలో ఉన్న దుకాణ సముదాయాన్ని నేలమట్టం చేసింది. దీంతో నిర్వాసితులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్కాపురి కాలనీ (Alkapuri Colony)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్ షెట్టర్స్ (Commercial shutters)ను అధికారులు తొలగించారు
అనుమతులు ఉన్నాయి : నిర్వాసితులు
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాలను తొలగించేందుకు హైడ్రా ఉపక్రమించింది. దీంతో షాపు యజమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్ని రకాల అనునమతులు ఉన్నాయని...




