Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు
                    Hyderabad Metro  : హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం మెట్రో రైలుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తున్నమెట్రో రైలు నగరంలోని అన్ని వర్గాలకు దగ్గరైంది. ఒక వైపు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూనే మరోవైపు అనేక రికార్డ్‌లను సృష్టిస్తోంది.
అయితే భాగ్యనగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లను అధిగమించేందుక అలాగే వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులు, విద్యార్థులు సైతం మెట్రో రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలులో రద్దీ బాగా పెరిగిపోయింది.
బిజినెస్ వేళల్లో కనీసం కాలు కూడా నిలపలేని పరిస్థితి నెలకొంటోంది. ట్రైన్లలో కూర్చుని సీట్లు దొరకడం గగణమైపోయింది. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మ...                
                
             
								



