Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం
Fatal Accident : రాజస్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) తరలిస్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 వాహనాలు దగ్ధమయ్యాయి. ఐదుగురు సజీవ దహనమయ్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జరిగిందంటే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రసాయన పదార్థాలు (కెమికల్స్) రవాణా చేస్తున్న ఓ ట్రక్కు జైపూర్- అజ్మీర్ జాతీయ రహదారి (National highway )పై అదుపు తప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వద్దకు చేరుకోలేనంతగా మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంతో ...


