Allu Arjun Press meet | నాపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
Allu Arjun Press meet | ఇటీవల పుష్ప 2 : ది రూల్ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శల నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషాద సంఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు, తొక్కిసలాట పూర్తిగా ప్రమాదవశాత్తుగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషాదంలో బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
" బాధిత కుటుంబానికి జరిగినదంతా నిజంగా హృదయ విదారకమైనదని అల్లు అర్జున్ ఎమోషనల్‌గా చెప్పాడు. "నేను ప్రతీ కొన్ని గంటలకోసారి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాను. నాకూ ఆ బాలుడి వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. పరిస్థితి తీవ్రత నాకు తెలుసు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
అలాగే అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వివిధ రాజకీయ ప్రముఖుల విమర్శలకు ప్రతిస్పందించారు. "నా గురించి చాలా తప్పుడు వి...



