Allu Arjun | అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన అల్లు అరవింద్, సీఎం రేవంత్
                    Stone Pelting Outside Allu Arjun House | హైదరాబాద్‌లోని నటుడు అల్లు అర్జున్ నివాసంపై ఓయూ జేఏసీతో పేరుతో కొందరు దుండగులు దాడి చేశారు. కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్ నివాసంపై రాళ్లు, టమోటాలు విసిరి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంటి లోపల ఉన్న పూల కుండీలు కూడా దెబ్బతినడంతో గందరగోళం నెలకొంది.రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బృందం నినాదాలు చేసింది. అల్లు అర్జున్ నివాసం వద్ద టమోటాలు విసిరే సమయంలో వారు వ్యక్తిగత సిబ్బందిని కూడా అడ్డుకున్నారు.
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సినిమా హాల్‌లో ప్రీమియర్ షోకి వచ్చిన సమయంలో తొక్కిసలాట కారణంగా మరణించిన 35 ఏళ్ల మహిళ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నటుడి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ తన నివాసంలో లేకపోవడం గమనార్హం....                
                
             
								



