Shyam Benegal | సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ కన్నుమూత
Shyam Benegal Passed away ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో కన్నుమూశారు. ఆయన మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో సహా సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమకు శ్యామ్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
శ్యామ్ బెనెగల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశాడు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనెగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్ భారతీయ సినీ దర్శకుడిగా.. చిత్ర రచయితగా కీర్తిప్రతిష్టలు పొందారు.
Legendary Filmmaker shyam benegal movies చాలా ఏళ్లు టీవీ సీరియల్స్‌లకు దర్శకత్వం వహించిన శ్యామ్ బెనగాల్.. ఆ తర్వాత సినీమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. శ్...




