Sarkar Live

Day: December 23, 2024

National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?
Trending

National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?

National Farmers Day : మ‌న భార‌త‌దేశంలో జాతీయ రైతుల దినోత్సవాన్ని కొన్నేళ్లుగా జ‌రుపుకుంటున్నాం. ప్ర‌తి ఏడాది డిసెంబ‌రు 23న కిసాన్ దివ‌స్‌గా దీన్ని నిర్వ‌హించుకుంటున్నాం. దివంగ‌త మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి (Charan Singh) సంద‌ర్భంగా ఆయ‌న స్మార‌కార్థం ఈ వేడుక‌ను జ‌రుపుకుంటున్నాం. ఈ కిసాన్ దివ‌స్‌ను మ‌న పాల‌కులు రైతుల‌కు అంకితం చేశారు. దేశానికి వెన్నుముక అయిన అన్న‌దాత‌ను గౌర‌వించ‌డానికి, కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి ఈ వేడుక‌ను మ‌నుగ‌డ‌లోకి తెచ్చారు. నేడు కిసాన్ దివ‌స్‌. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ రోజు భార‌త‌దేశం దీన్ని నిర్వ‌హిస్తోంది. కిసాన్ దివ‌స్ ( National Farmers Day ) చరిత్ర చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. రైతుల సంక్షేమానికి పాటుప‌డిన ఆయ‌న వ్యవసాయ‌రంగ అభివృద్ధికి అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశారు. అనేక విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్...
error: Content is protected !!