Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?
                    Christmas Celebrations 2025  ప్రపంచంలోని చాలా దేశాలు డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటాయి. చర్చిల్లో క్రీస్తు కోసం ప్రార్థనలు, క్రిస్మస్ ట్రీలు, విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. అయితే, అన్ని దేశాలు లేదా కమ్యూనిటీలు డిసెంబర్ 25న క్రిస్మస్‌ను పాటించవు. ఆయా దేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన క్యాలెండర్లు, చారిత్రక ఆచారాల కారణంగా ఈ వేడుకలు జరుపుకోవు. 25న క్రిస్మస్ జరుపుకోని దేశాలు, వారి ప్రత్యేక సంప్రదాయాల వెనుక గల కారణాలను ఇక్కడ చూడండి.
Christmas Celebrations జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటున్న దేశాలు
ఈ తేదీ జూలియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13 రోజులు వెనుకబడి ఉంది. అనేక దేశాల్లోని ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘాలు జనవరి 7న క్రిస్మస్‌ను జరుపుకుంటాయి.
రష్యా: రష...                
                
             
								