MT Vasudevan Nair : లెజెండరీ మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
MT Vasudevan Nair | మలయాళ సాహిత్య రంగం ఒక దిగ్గజ రచయితను కోల్పోయింది.. సుప్రసిద్ధ సాహితీవేత్త MT వాసుదేవన్ నాయర్ అనారోగ్య సమస్యలతో కోజికోడ్‌లోని ఒక ఆసుపత్రిలో గత రాత్రి కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా, వాసుదేవన్ తన అసమానమైన సృజనతో సాహిత్య ప్రపంచాన్ని అలంకరించారు నాయర్. మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసిన ఆయన..తను ప్రవేశించిన ప్రతి రంగంలో ఉన్నతంగా రాణించారు. అతని రచనలు మలయాళ భాషకు ప్రపంచ స్థాయి కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చాయి.
రాండమూజం వంటి దిగ్గజ రచనల రచయిత, MT వాసుదేవన్ సాహిత్య ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయే వారసత్వాన్ని మిగిల్చారు. "అలలు తీరాన్ని చేరుకుంటున్నట్లు" ఆయన రచన తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. MT వాసుదేవన్ నాయర్ (91) గత 11 రోజులుగా గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యల కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరు. ఈక్రమంలో మూత్రపిండాలు, గుండె పనితీరు క్షీణించడంతో ...
