Sarkar Live

Day: December 27, 2024

SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు
Career

SBI PO Recruitment 2025 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవో ఉద్యోగాలు

SBI PO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ల (POs) నియామక ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. SBI PO 2025 రిజిస్ట్రేషన్ ఈరోజు (2024 డిసెంబర్ 27) ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక SBI వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. SBI PO నియామక ప్రక్రియలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుకు 600 ఖాళీలను అందుబాటులో ఉంచారు. భారత బ్యాంకింగ్ రంగంలో కెరీర్ సాధించాలని ఆశించే వారికి ఇది స‌ద‌వ‌కాశం. ఆసక్తి గల అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్‌తోపాటు దరఖాస్తు సమర్పణ ప్రక్రియను 2025 జనవరి 16 లోపు పూర్తి చేయాలి. అభ్యర్థులు SBI PO 2025 రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫారం, ఫీజు చెల్లింపు వివరాలు ఇలా ఉన్నాయి. SBI PO 2025 పోస్టుల వివరాలు ఖాళీలు: 600 అర్హతలు: అభ్యర్థి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.డిగ్రీ చివర...
Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’
National

Manmohan Singh | ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ప్రాణం పోసిన ‘డాక్ట‌ర్‌’

Manmohan Singh : మ‌న్మోహ‌న్ సింగ్‌.. మృదు స్వ‌భావి. నోట్లో నాలుక ఉండ‌దన్న‌ట్టే క‌నిపించిన ఆయ‌న ఓ నిశ్శ‌బ్ద విప్ల‌వం. రెండు సార్లు ప్ర‌ధానిగా ప్రాతినిధ్యం వ‌హించిన మ‌న్మోహ‌న్ సింగ్ (Manmohan Singh) ఆర్థికవేత్త‌గా త‌న‌కున్న అనుభ‌వంతో అనేక సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకొచ్చారు. ఆర్థిక మాద్య‌మాన్ని గాడిలో పెట్టి దేశానికి కొత్త దిశ చూపారు. మ‌న్మోహ‌న్ సింగ్ (92) మృతి చెందార‌నే వార్త భార‌త్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దిగ్భ్రాంతిని క‌లిగించింది. ఒక గొప్ప ఆర్థికవేత్త‌ను కోల్పోయామ‌నే విషాదఛాయ‌లు అలుముకున్నాయి. ఆర్థికరంగ‌ డాక్ట‌ర్.. Manmohan Singh ప్ర‌స్తుత‌ పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జ‌న్మించిన మన్మోహన్ సింగ్ ఉన్న‌త విద్యను అభ్య‌సించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన‌ప్ప‌టికీ పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రం...
IITs NIRF rankings | కాన్పూర్, ఢిల్లీ, బాంబే ఐఐటీల్లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి.. ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు ఇవే..?
Career

IITs NIRF rankings | కాన్పూర్, ఢిల్లీ, బాంబే ఐఐటీల్లో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి.. ప్లేస్‌మెంట్ ప్యాకేజీలు ఇవే..?

IITs NIRF rankings న్యూఢిల్లీ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) భారతదేశంలోని స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయాల సమూహం. ఇందులో అత్యంత‌ కఠినమైన ప్రవేశ పరీక్షలు, ఉన్నత విద్యా ప్రమాణాలతో ప్ర‌సిద్ధి చెందాయి. IITలు ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌లోని వివిధ రంగాలలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్చ‌ డాక్టోరల్ ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. ఐఐటీల విషయానికి వస్తే, ఇందులో టాప్ ప్లేస్ లో ఏ ఐఐటీ ఉందో మీకు తెలుసా? NIRF ర్యాంకింగ్ 2024 (NIRF rankings 2024) ప్రకారం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ మొత్తం కేటగిరీలో దేశవ్యాప్తంగా టాప్ టెన్‌లో మొద‌టి స్థానంలో ఉంది. ఇంజినీరింగ్‌ విభాగంలో అగ్రస్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రతి IIT ఒక్కో నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది. ఉదాహరణకు, IIT మద్రాస్ (IIT Madras) దాని బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ ఇం...
TGSRTC | సజ్జనార్ సార్ మెడికల్ ఆఫీసర్ ని మార్చండి…
Special Stories

TGSRTC | సజ్జనార్ సార్ మెడికల్ ఆఫీసర్ ని మార్చండి…

వరంగల్ రీజియన్ మెడికల్ ఆఫీసర్ ను మార్చాలని వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులపై ఆ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఔట్ సోర్సింగ్ డాక్టర్ ఆర్టీసీ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లు ప్రచారం. సమస్య ఉందని సంప్రదిస్తే.. అధికారులకు ఫోన్ చేసి సిక్ ఇవ్వాలా?వద్దా ?అని అధికారులను అడుగుతోందని ఆరోపిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Warangal | ఆర్టీసీ(TGSRTC)లో ఆ మెడికల్ ఆఫీసర్ తమను చిన్నచూపు చూస్తుందని కనీసం తమకు ఏదైనా సమస్య (ఇబ్బంది) ఉంది. మాకు సిక్ లీవ్ కావాలని డాక్టర్ ను సంప్రదిస్తే కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ ఉద్యోగులతోపాటు, రిటైర్డ్ కార్మికులు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ రీజియన్ లో మెడికల్ ఆఫీసర్ గా(Medical Officer) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సదరు డాక్టర్ తన వద్దకు వచ్చే ఆ...
error: Content is protected !!