Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్..
Charlapalli Railway Station : రూ.413 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఈరోజు డిసెంబర్ 28, 2024న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త రైల్వే టెర్మినల్ ను ప్రారంభించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలోనే మరో తేదీని ప్రకటించే చాన్స్ ఉంది.
కాగా, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగర ప్రాంతానికి చర్లపల్లిని కీలక రైల్వే టెర్మినల్‌గా మార్చాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ. లింగంపల్లి వంటి ప్రస్తుత టెర్మినల్స్ పై భార...




