Civil Supplies | రవాణా కుంభకోణం..
లారీలు పెట్టింది లేదు.. ధాన్యం తరలించేది అస్సలు ఉండదు..
కొన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని మోసం చేసిన ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు
కాంట్రాక్టర్ లకు క్వింటాలు కు ప్రభుత్వం ఇచ్చేది 32 రూపాయలు రైతుకు కాంట్రాక్టర్ చెల్లించేది గరిష్టంగా 15 రూపాయలు
అంతా తెలిసినా కాంట్రాక్టర్ లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియాలి.
Telangana Civil Supplies Department | పౌరసరఫరాల శాఖలో రవాణా పేరుతో కొన్ని సంవత్సరాలుగా భారీ అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు టెండర్ లు దక్కించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ లు ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిసింది.కొందరు కాంట్రాక్టర్ లు అయితే లారీలు పెట్టకుండానే ధాన్యం తరలించినట్లు రికార్డులు చూపి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేసినట్లు సమాచారం.సదరు కాంట్రాక్టర్ లకు పౌరసరఫరాల...

