Sarkar Live

Day: December 30, 2024

BSNL New Year Recharge Plan | గేరు మార్చిన బిఎస్ఎన్ఎల్.. కొత్త ఏడాది చవకైన రీఛార్జ్ ప్లాన్‌..
Technology

BSNL New Year Recharge Plan | గేరు మార్చిన బిఎస్ఎన్ఎల్.. కొత్త ఏడాది చవకైన రీఛార్జ్ ప్లాన్‌..

BSNL New Year Recharge Plan : ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్ BSNL తన వినియోగదారులకు అత్యంత సరసమైన డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది . కొత్త సంవత్సరానికి ముందు BSNL రూ. 277 ధరతో రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. వినియోగదారులకు 60 రోజుల వ్యాలిడిటీలో 120GB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ టెలికాం మార్కెట్‌లో ఇది గేమ్ చేంజ‌ర్ గా మార‌వ‌చ్చు. మరోవైపు ముఖేష్ అంబానీ జియో, సునీల్ మిట్టల్ ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ ప్లేయర్‌లకు గ‌ట్టి స‌వాల్‌గా మారుతుందని టెలికాం విశ్లేష‌కులు భావిస్తున్నారు. BSNL న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్ BSNL New Year Recharge Plan : బిఎస్ఎన్ఎల్‌ రూ. 277 రీఛార్జ్ ప్లాన్ లో 60 రోజుల వాలిడిటీ వ‌స్తుంది. మొత్తం 120GB డేటాను ను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇది రోజుకు 2GB డేటా వినియోగించుకోవ‌చ్చు. ఇది భారీగా డేటా వినియోగించేవారికి త‌క్కువ‌ బడ్జెట్ లో అనుకూలమైన రీచార్జ్‌గా చెప్ప‌వ‌చ...
Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్
National

Rajnath Singh | సైనిక శిక్ష‌ణ సంస్థల ప‌నితీరు భేష్‌.. ప్ర‌శంసించిన రాజ్‌నాథ్

Rajnath Singh : భార‌తదేశంలో సైనిక శిక్ష‌ణ సంస్థ‌ల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మ‌ని రక్షణ శాఖ మంత్రి (Defence Minister ) రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని మౌలో ఉన్న ఆర్మీ వార్ కాలేజ్ (AWC), ఇన్ఫెంట్రీ స్కూల్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇంజినీరింగ్ (MCTE)ను ఈ రోజు ఆయ‌న‌ సంద‌ర్శించారు. జాతీయ భద్రత, సాంకేతిక అభివృద్ధికి ఈ సంస్థ‌లు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కొనియాడారు. వ్యూహాలు, నైపుణ్యాల కృషిపై.. సైనిక వ్యూహాలకు ప‌దును ప‌ట్ట‌డం, యుద్ధ నైపుణ్యాలను మెరుగుప‌ర్చ‌డం, సైనిక సామ‌ర్థ్యాల‌ను పెంచ‌డంలో శిక్ష‌ణ సంస్థ‌లు విశేష కృషి చేస్తున్నాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. భారత సైన్యం వ్యూహాత్మక సిద్ధత, పోరాట సామర్థ్యాలను పెంచడానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయ‌ని అన్నారు. సాంకేతికతపై Rajnath Singh ఏమ‌న్నారంటే… సైనిక‌ సంస్థల్లో ఆపరేషనల్ మెరుగు...
Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు
State

Numaish : హైద‌రాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు

Numaish 2025 postponed details | హైద‌రాబాద్ (Hyderabad)లో నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) షెడ్యుల్‌లో మార్పు జ‌రిగింది. జ‌న‌వరి 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ఎగ్జిబిష‌న్ (Numaish) ప్రారంభ తేదీని మార్చారు. మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh)మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడుదినాల జాతీయ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. Numaish ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. హైదరాబాద్‌లో ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Exhibition) ఎంతో ప్ర‌ఖ్యాతిని పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దీన్ని నిర్వ‌హిస్తారు. మొద‌ట 1938లో 50 స్టాల్స్‌తో ఇది ప్రారంభమైంది. ఇప్పుడిది భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. షాపింగ్, వ్యాపారం, వినోదం, విశ్రాంతిని కలిపే ఈ ప్రదర్శన దేశం నలుమూలల నుంచ...
Illegal Registrations : అంజద్ అలీనా..మజాకా..?
Special Stories

Illegal Registrations : అంజద్ అలీనా..మజాకా..?

అక్రమ రిజిస్ట్రేషన్ విలువ..పది లకారాల పైనేనని ప్రచారం నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ? సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ లకు సాక్ష్యాలు ఇవే.. సస్పెన్షన్ తప్పదని లీవ్ పెట్టినట్లు గుసగుసలు… విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్న కమిషనర్ (ఐ జీ) పట్టించుకోని జిల్లా రిజిస్ట్రార్…? Illegal Registrations In Warangal : అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) సిద్ధహస్తుడని,అక్రమ రిజిస్ట్రేషన్ లు చేయడంలో పోటీ నిర్వహిస్తే గోల్డ్ మెడల్ సాధిస్తాడని కొంతమంది డాక్యుమెంట్ రైటర్ లు అంటున్నారు. సారుకు కావాల్సింది సమర్పిస్తే నిబంధనలతో పనే ఉండదని,తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ ల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్టాం...
Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..
Trending

Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..

Punjab Bandh LIVE : పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌ను క‌ల్పిస్తూ దాన్ని చట్ట‌బ‌ద్ధ‌త చేయాల‌ని, త‌మ ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రైతులు త‌మ నిర‌స‌న‌ను మ‌రోరూపంలో వ్య‌క్త‌ప‌రిచారు. తాజాగా పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రోజు జ‌న‌జీవ‌నం స్తంభించింది. వ్యాపార‌, వాణిజ్య, రోడ్డు, రైల్వే సేవ‌లకు అంత‌రాయం ఏర్ప‌డింది. వ్యాపార వ‌ర్గాల మ‌ద్ద‌తు పంజాబ్ రైతుల బంద్ కార‌ణంగా ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగ సంస్థ‌లను మూసివేశారు. ఇది ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఇది కొన‌సాగుతుంద‌ని రైతులు ప్ర‌క‌టించారు. అత్యవసర సేవలు యథావిధిగా ఉంటాయ‌న్నారు. సాయంత్రం వరకు పాల, పండ్లు, కూరగాయల సరఫరా ఉండదని, ఆ వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇత‌ర అత్యవ‌స‌ర వాహనాలను అనుమ‌తిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మాత్ర...
error: Content is protected !!