leopard : పులి సంచారంతో వణికిపోతున్న గ్రామాలు..
leopard Spotted : తెలంగాణలోని పలు జిల్లాల్లో పులి సంచారం ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. ఇటీవల కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా, ములుగు జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచరించిన ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. వెంటనే సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి మందస్తు జాగ్రత్తలుపాటించాలని సూచనలు చేశారు. అయితే సోమవారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామంలో సోమవారం నీటి ట్యాంకు వద్ద పులి సంచారించడాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
పత్తి పంటను కోస్తున్న కొందరు స్థానిక రైతులు వ్యవసాయ బావి సమీపంలో పులి పాదముద్రలను గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మొబైల్ ఫోన్‌లలో పులి పాదముద్రలను పొటోలు తీసి అటవీ అధికారులకు తెలియజేశారు. పులి సంచారంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
పులి సంచారాన్ని కుణ్ణంగా పరిశీల...




