Savitribai Phule : ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
                    Telangana Women Teacher Day : రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (Savitribai Phule Jayanti) (జనవరి 3) వేడుకలను  ఘనంగా నిర్వహించనుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే.. మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. మహిళా సాధికారత కోసం  ఆమె చేసిన సేవలను  గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని  నిర్ణయిస్తూ ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు. 
సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule ) గురించి సంక్షిప్తంగా
savitribai phule history : మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఒక సాధారణ రైతు కుట...                
                
             
								



