HMPV : చైనా వైరస్ విజృంభణ.. ఇండియాలో కేసులు నమోదు
చైనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. క్రమేణా విస్తరిస్తోంది. బెంగళూరులో మానవ మెటాప్న్యుమో వైరస్ (HMPV) రెండు కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో హెచ్ఎంపివి వైరస్ మొదటి కేసులు ఇవే. ఎనిమిది, మూడు నెలల ఇద్దరు శుశువులు దీని బారిన పడ్డారు. ఎనిమిది నెలల శిశువు చికిత్స పొందుతుండగా, మూడు నెలల శిశువును ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
వేగంగా వ్యప్తి చెందుతున్న వైరస్
ప్రస్తుతం చైనాలోహెచ్ఎంపివి వైరస్వ్యాప్తి విపరీతంగా ఉంది. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇన్‌ఫ్లూయెంజా A, HMPV, మైకోప్లాజ్మా న్యూమోనియా, కొవిడ్-19 వంటి అనేక వైరస్‌లు చైనాలో వ్యాప్తి చెందుతున్నాయి. శ్వాస సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న అక్కడి బాధితుల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
HMPV అంటే ఏమిటి?
HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్. ఇది మొదట 2001లోనే వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ను ...




