Hydraa Police Station | హైడ్రా తొలి పోలీస్‌స్టేషన్ ఏర్పాటు
                    Hydraa Police Station | హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు,కుంటలను కబ్జా చేసే వారిపై ఇక నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydraa Police Station) లో కేసులు నమోదు చేయనున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించనుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్
Hydraa Grievance cell :  ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కు...                
                
             
								



