Court Jobs | జిల్లా కోర్టుల్లో కొలువులు.. దరఖాస్తులు ఆహ్వానం
Court Jobs in Telangana 2025 : తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టుల్లో 340 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాలకు జీతంతో పాటు అదనపు అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
దరఖాస్తు వివరాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2025 జనవరి 8చివరి గడువు: 2025 జనవరి 31
అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్ http://tshc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితివయస్సు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య.సడలింపు: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు. దివ్యాంగులకు 10 ఏళ్లు.కట్ ఆఫ్ డేట్: 2025 జూలై 1.
Court Jobs Notification 2025 జీతం , ఇతర ప్రయోజనాలు
వేతనం: రూ. 24,280 – రూ. 72,850 (పే స్కేల్ ఆధారంగా).
నెలసరి కనీస జీతం: సుమారు రూ. 31,000...




