Tirupati stampede : తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి సస్పెన్షన్..
                    Tirupati temple tragedy : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట (Tirupati stampede) లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి పదుల సంఖ్యలో గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
 ప్రమాద ఘటన వద్ద ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డీఎస్పీ రమణ్‌కుమార్, ఎస్వీ గోసాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్‌రెడ్డి సస్పెండ్ అయ్యారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.గౌతమి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌లు బదిలీ అయ్యారు.
శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మహిళను తరలించేందుకు పద్మావతి పార్క్ వద్ద గేట్లను తెరవాలని కోరినపుడు డిఎ...                
                
             
								



