Pravasi Bharatiya Express | ఎన్ఆర్ఐల కోసం అందుబాటులోకి ప్రత్యేక రైలు..
Pravasi Bharatiya Express : ఎన్ఆర్ఐల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. దీన్ని ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi ) ఈ రోజు ప్రారంభించారు. ఈ రైలు మూడు వారాల పాటు భారతదేశంలోని వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయణిస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రవాసీ తీర్థ దర్శన్ యోజన (Pravasi Teertha Darshan Yojana)లో భాగంగా దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రవాసీ భారతీయ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు
ఈ రైలును 45 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ ప్రవాసుల (NRIs) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 2025 జనవరి 9 న ప్రారంభమయ్యే ఈ రైలు మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణిస్తుంది. ఈ రైలును జనవరి 9 నాడే ప్రారంభించడానికి ఓ ప్రత్యేకత ఉంది. 110 సంవత్సరాల క్రితం 1915లో మహా...



