Hanuman : బాక్సాఫీస్ ని షేక్ చేసిన హను-మాన్ కి ఏడాది…
Hanuman Movie : మొదటి నుంచి కూడా వైవిద్యమైన కథలను ఎంచుకొని డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). మొదటి సినిమా 'అ'తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత వచ్చిన కల్కి, జాంబిరెడ్డి, అద్భుతం, సినిమాలతో మిగతా డైరెక్టర్ల కంటే డిఫరెంట్ జానర్లో ఆలోచించి హిట్టుకొట్టారు.
ఇక గతేడాది తేజ సజ్జ (Teja Sajja) హీరోగా హనుమాన్ (Hanuman)అనే సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. తక్కువ బడ్జెట్ లోనే తీసిన ఈ మూవీ దాదాపు 400 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
ఈ మూవీ విడుదలై ఏడాది అయిన సందర్భంగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తన చేతిపై గదతో ఉన్న టాటూ వేయించుకొని హనుమాన్ సినిమాలో నటించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఆ ఏడాది పెద్ద సినిమా హీరోల కంటే ఈయన తీసిన మూవీ పెద్ద హిట్ కావడంతో ప్రశాంత్ వర్మ పెద్ద డైరెక్టర్ల లి...




